బెజవాడలో కార్ రేసింగ్ కలకలం.. పోలీసులు అదుపులో యువతీయువకులు

బెజవాడలో కార్ రేసింగ్ కలకలం.. పోలీసులు అదుపులో యువతీయువకులు

 ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జగింది. విజయవాడ జాతీయ రహదారిపై కారు రేసింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. రమేష్ ఆసుపత్రికి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

అతివేగం ప్రమాదం అని ఎందరు చెప్పినా కొందరు  మాత్రం మాట వినడం లేదు. అత్యుత్సాహంతో అతివేగంగా వెళ్లి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.  విజయవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. నగరం నడిబొడ్డున  కారు రేసింగ్‌లు నిర్వహిస్తూ.. ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యారు. మరో దారుణ విషయం ఏంటంటే.. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆదివారం  ( నవంబర్​ 19) తెల్లవారుజామున నిర్వహించిన ఈ రేస్‌ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన రేస్‌ కారులు రోడ్డు మీద వేళ్తున్న రెండు స్కూటీలను ఢీకొట్టాయి. ఈ ఘటనలో స్కూటీలు రెండు ముక్కలవ్వగా.. పలువురు గాల్లోకి ఎగిరి పడ్డారు. 

దీంతో స్కూటీపై ఉన్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడి పోయారు. వేగంగా వచ్చిన ఫార్చునర్ కారు బలంగా ఢీకొట్టింది.   యువతీయువకులు భయంతో కారును అక్కడే వదిలేసి మరో కారులో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కారులో నుంచి అమ్మాయి, అబ్బాయిలు దిగి మరో కారులో పారిపోయారు.  రమేష్ ఆస్పత్రి సమీపంలో కారు రేసింగ్ జరుగుతుండగా రోడ్డు ప్రమాదం జరుగడంతో ఈ కారు రేసింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను కారు రేసింగ్ లో పాల్గొన్న ఫార్చునర్ కారు బలంగా ఢీ కొట్టింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారు.. ఎప్పటి నుంచి కారు రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక వీరు నగరంలోని ఏఏ ప్రాంతాలలో రేసింగ్ లు నిర్వహిస్తున్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.